- Advertisement -
హైదరాబాద్: చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో దొంగతన చేసిన దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పటాన్ చెరువు సర్వీసు రోడ్ వెళ్తున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖజానా జ్యువెలరీ షాపులో అభరణాలను ఆరుగురు దొంగలు ఎత్తుకొని రెండు బైక్ లపై పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ముఖానికి మాస్కు, తలపై క్యాపు, చేతులకు గ్లౌజులు వేసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దొంగతనం చేసిన బైక్ లనే దోపిడీకి వాడినట్లుగా పోలీసులు గుర్తించారు. మంగళవారు పది గంటల సమయంలో చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో (Khazana Jewellery) దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాకులతో సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
- Advertisement -