Thursday, August 14, 2025

భారత్ పై ట్రంప్ సుంకాల దాడి.. అమెరికా వెళ్లనున్న ప్రధాని మోడీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్ పై సుంకాల మీద సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యుఎస్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేయాలంటూ.. భారత్ పై ట్రంప్ రెండు సార్లు 25 శాతం చొప్పును అధనపు సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. మేం చెప్పినట్లు వినకపోతే.. ముందు ముందు ఇంకా పెంచుతామని ట్రంప్ హెచ్చరించాడు. ఈ క్రమంలో ప్రధాని మోడీ వచ్చే నెల సెప్టెంబర్ లో న్యూయార్క్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. అక్కడ 80వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశం సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. ఉన్నత స్థాయి జనరల్ డిబేట్ సెప్టెంబర్ 23-29 వరకు కొనసాగుతుంది.

ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, ట్రంప్ తోపాటు పలువురు ప్రపంచ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో భారత్-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలపై పరిష్కారం కోసం ట్రంప్ తో మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, పలు దేశాల అధిపతులతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News