Thursday, August 14, 2025

నల్గొండ X రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని నల్గొండ X రోడ్ (Hyderabad Nalgonda-X-Road) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాక్టివ బండిపై వెళ్తున్న మహిళను ఆర్టిసి బస్సు కొట్టడంతో ఆమె స్పాట్‌లోనే మృతి చెందింది. మృతి చెందిన మహిళ నాంపల్లి రెడ్ హిల్స్‌లోని సాయి సుధ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే సింధు సూర్యన్‌(45)గా గుర్తించారు. ఆమె భర్త పేరు అనిల్ కుమార్ అని తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన ఆర్టిసి బస్సు అచ్చంపేట డిపోకి చెందినదిగా డ్రైవర్ పేరు వెంకటేష్(35) అని పోలీసులు వెళ్లడించారు. నల్గొండ X రోడ్ నుంచి పల్టాన్ వైపు తన యాక్టివ (నెంబర్ టిఎస్13 ఇజె0325)పై సింధు వెళ్తుంది. ఆ సమయంలో ఆర్టిసి బస్సు డ్రైవర్ వెంకటేష్ ఆమెను వెనుక నుంచి బస్సుతో ఢీకొట్టాడు. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టింది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వెంకటేష్‌ని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News