Thursday, August 14, 2025

ఒటిటిలోకి వచ్చేస్తున్న ‘సూపర్‌మ్యాన్’.. ఎక్కడ చూడొచ్చంటే..

- Advertisement -
- Advertisement -

సాధారణంగా సూపర్ హీరో చిత్రలకు భలే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రాలను చూసేందుకు చాలా ఇష్టపడుతుంటారు. అందులోనూ సూపర్‌మ్యాన్ (Superman) సిరీస్‌లో వచ్చే సినిమాలు వేరే లెవల్‌లో ఉంటాయి. డిసి యూనివర్స్‌ నుంచి వచ్చే ఈ సూపర్ హీరో సిరీస్‌లలో ఏ సినిమా అయినా వేరే లెవల్‌లో ఉంటాయి. 1948 నుంచి సూపర్‌మ్యాన్ సిరీస్‌లో సినిమాలు వస్తున్నాయి. అప్పటి నుంచి ఈ సినిమాకు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ సిరీస్‌ నుంచి ‘సూపర్‌మ్యాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జూలై 11వ తేదీన సూపర్‌మ్యాన్ (Superman) లేటెస్ట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఊహించినంత స్పందన రాలేదు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. అయితే విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఒటిటిలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు జేమ్స్ గన్ అధికారికంగా ప్రకటించారు. ఈ శుక్రవారం సూపర్‌మ్యాన్ మీ ఇళ్లకు వస్తున్నాడు.. ఈలోపు థియేటర్‌లో అందుబాటులో ఉంటే చూసేయండి అంటూ పేర్కొన్నారు. కాగా, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టివి, ఫాండంగో ఒటిటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News