Wednesday, August 13, 2025

నెల్లూరులో పాత కక్షలతో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: నగరంలో పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నెల్లూరు అలంకార్ సెంటర్‌లో (Nellore Alankar Center) కొందరు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. లైక్ అనే యువకుడిపై దుండుగులు కత్తితో దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. నూర్ అనే యువకుడికి లైక్‌కి పాత కక్షలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిన ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు వీరిద్దరు స్నేహితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, కొద్ది రోజుల క్రితమే మనస్పర్ధలు వచ్చి విడిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లైక్ మృతదేహఆన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News