Thursday, August 14, 2025

ఎల్లంపల్లి ఎత్తిపోతలు షురూ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ధర్మారం: కాళేశ్వరం అనుబంధ లింక్-2 పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నంది మేడారం మంది పంపు హౌస్ నుండి బుధవారం నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గో దావరి పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు మంగళవారం సా యంత్రం కడెం ప్రాజెక్టు నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.8016 టీఎంసీల సామర్ధ్యానికి చేరిం ది. ఈ క్రమంలో మరింత నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి చేరనున్న నేపథ్యంలో ముందస్తుగా అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్ లో తోలుత 2 మోటార్లను, ఆ తరువాత అరగంట వ్యవధిలో 3వ మోటార్ ను ఆన్ చేశారు.

దీంతో 9,450 క్యూసెక్కుల చొప్పున నీరు డెలివరీ సిస్టర్న్ల ద్వారా గోదావరి జలాలు ఎగిసిపడుతూ నంది రిజర్వాయర్లోకి పంపింగ్ అవుతూ అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కు నంది రిజర్వాయర్ నుంచి జంట సొరంగాల ద్వారా నీరు సరఫరా అవుతుంది. అక్కడి పంప్ హౌస్ లో 3 మోటార్లను ఆన్ చేసి అదే పరిమాణంలో మిడ్ మానేరులోకి నీటి సరఫరా చేస్తున్నారు. కాగా వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నంది పంపు హౌస్ ద్వారా ప్రక్రియ మొదలు కావడం ఇదే మొదటిసారి. కాలేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి తొలి సొరంగ మార్గమైన నంది మేడారం నంది పంప్ హౌస్ నుండి మూడు బాహుబలి మోటార్ల ద్వారా పెద్ద ఎత్తున తరలివస్తున్న నీటిని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. నంది మేడారంలోని నంది రిజర్వాయర్ నీటితో కలకలాడుతూ కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News