- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మచైల్ మాత యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. వరదల్లో కొట్టుకొని పోయి 22 మంది మృతి చెందారు. కిష్త్వార్ జిల్లాలో కుంభ వృష్టితో మచైల్ మాత యాత్రకు వెళ్లే దారిలో భారీ వర్షం పడడంతో భక్తులు వరదల్లో కొట్టుకొనిపోయి 22 మంది మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మచైల్ మాత యాత్రను వెళ్లే భక్తులను నిలిపివేశారు. 65 మందిని రెస్క్యూ టీమ్ కాపాడారు. జమ్ము కశ్మీర్ భారీ వర్షాలు కురవడంతో కొండ ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
- Advertisement -