Thursday, August 14, 2025

పులివెందుల, ఒంటిమిట్టలో టిడిపి ఘన విజయం

- Advertisement -
- Advertisement -

కడప: పులివెందుల, ఒంటిమిట్ట జడ్‌పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. ఒంటిమిట్ట టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణా రెడ్డి 6267 ఓట్ల తేడాతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లురాగా వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డికి 6513 ఓట్ల వచ్చినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

పులివెందుల జెడ్  పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. వైసిపి అభ్యర్థిపై టిడిపి అభ్యర్థి 6052 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లురాగా వైసిపి అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో టిడిపి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News