Thursday, August 14, 2025

అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా..?: హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బిఆర్‌ఎస్ నాయకులు చేసిన తప్పా..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని నిలదీశారు. కౌటాలా పోలీసు స్టేషన్‌లో నిర్బంధించిన ప్రవీణ్ కుమార్ సహా బిఆర్‌ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News