- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిమ్స్ లోని మదర్ అండ్ చైల్డ్ బ్లాక్లో గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 10 ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోగులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుంటంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల కొన్ని విభాగాలకు నష్టం వాటిల్లిందని చెప్పారు.
- Advertisement -