Thursday, August 14, 2025

బర్రె తెచ్చిన పంచాయతీ.. మహిళను చెట్టుకు కట్టేసి దాడి

- Advertisement -
- Advertisement -

బర్రె తెచ్చిన పంచాయతీలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన మోపాల్ మండలంలోని సింగంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… మోపాల్ మండలంలోని సింగంపల్లికి చెందిన సవితపై అదే గ్రామానికి చెందిన గంగారం చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. గంగారాంకు చెందిన బర్రె సవిత ఇంటి వద్ద మల విసర్జన చేస్తుందని ఈవిషయం గంగారంకు పలుమార్లు తెలిపిన పట్టించుకోవడం లేదని బుధవారం సవిత ఆ బర్రెను చెట్టుకు కట్టేసింది. ఈమేరకు గంగారం ఆగ్రహించి సవితను చెట్టుకు కట్టేసి కొట్టాడు. స్థానికులు విడిపించడంతో సవిత బుధవారం సాయంత్రం మోపాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాడు చేయగా  అక్కడ ఉన్న సిబ్బంది పట్టించకోకపోవడంతో గురువారం నేరుగా పోలీస్ కమిషనర్‌ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల ఈమేరకు మోపాల్ ఎస్ఐ కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News