Thursday, August 14, 2025

జమ్మూకశ్మీర్లో క్లౌడ్‌బరస్ట్.. 38కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీర్ లోని జమ్మూ కశ్మీర్ లోని క్లౌడ్‌బరస్ట్ కారణంగా వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. గురువారం(ఆగస్టు 14) కిష్త్వార్ జిల్లాలో మచైల్ మాతా యాత్రకు వెళుతుండగా కారణంగా వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. గురువారం(ఆగస్టు 14) కిష్త్వార్ జిల్లాలో మచైల్ మాతా యాత్రకు వెళుతుండగా చోసిటి గ్రామంలో కుండపోత వర్షంతో ఒక్కసారిగి వరదలు ముంచెత్తాయి. దీంతో మచైల్ మాత యాత్రకు వెళ్తున భక్తులు వరదల్లో కొట్టుకుపోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సంఘటనాస్థలం నుంచి ఇప్పటివరకు 38 మంది మృతదేహాలను వెలికితీశారని.. ఇంకా చాలా మంది గల్లంతు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ సిఎం, ఎల్జీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రధాని మోడీ క్లౌడ్‌బరస్ట్‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News