- Advertisement -
మనతెలంగాణ/మోత్కూర్: స్నేహితుడి కుటుంబానికి చిన్ననాటి బాల్య మిత్రులు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. మండలంలోని పాలడుగు గ్రామానికి చెందిన బొంత నర్సింహ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. నర్సింహ్మకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలిసి బాల్య మిత్రులు రూ.30 వేలు గురువారం ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పబ్బు హనుమయ్య, బీఎన్ చారి, ఆంజనేయులు, నరసింహ, రమేష్, మత్సగిరి, వెంకట్, నరేష్, చంద్రశేఖర్‌రెడ్డి, గుండు శ్రీను, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసచారి, సాగర్, లింగయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -