- Advertisement -
మన తెలంగాణ/చేర్యాల: ప్రమాదవశాస్తూ విద్యుత్తు షాక్ తో గ్రామపంచాయతీ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని వేచరేణి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎండి మోహిన్ పాషా (32) గ్రామపంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆగస్టు 15 (పంద్రాగస్టు) వేడుకలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ కోసం జెండా వైపు ఇనుప చక్రం శుభ్రం చేస్తున్న క్రమంలో పైపు 11 కెవి విద్యుత్ వైర్లకు తగలడంతో అక్కడికక్కడే కరెంట్ షాక్ తో మృతి చెందాడని తెలిపారు. ఎల్లప్పుడూ గ్రామ పంచాయతీ పనులలో చురుకుగా ఉండే వ్యక్తి అకస్మాత్తుగా మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఒక కొడుకు ,ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -