మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సహకార ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. సంస్థాగతంగా సభ్యత్వాల న మోదు ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా సహకార సంస్థ్ధల పాలకవర్గం గడువును పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), ప్రా థమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్), టెస్కాబ్ మేనేజింగ్ కమిటీల గడువు మరో ఆరు నెలలపాటు పొడిగిస్తు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్య వసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ జివో జారీచేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాలు, తొమ్మిది డీసీసీబీ చైర్మన్లు తదుపరి ఆదేశాల వచ్చే వరకు పదవీలో కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా, ఆరు నెలల లోపు కూడా ఎన్నికల నిర్వహణకు అవకాశాలు లేకపోలేదు. సభ్యత్వాలు పూర్తయి పరిస్థితులు అనుకూలించినట్లయితే ఈ ఆరు నెలల లోపే ఎన్నికలు నిర్వహించగలమని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
మరో 6 నెలలు సహకారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -