Friday, August 15, 2025

అక్రమ గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్ క్రైం ః నగరంలో అక్రమ గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ ఇన్స్‌పెక్టర్ స్వప్న తెలిపారు. ఈమె తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆసద్ బాబానగర్‌కు చెందిన షేక్ అక్రమ్, షేక్ ఇరాన్‌కు గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ ఇన్స్‌పెక్టర్ స్వప్న ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వారి నుంచి 4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో షేక్ అక్రమ్‌ను అదుపులోకి తీసుకోగా షేక్ ఇరాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీంతో కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ మల్లేష్, సిబ్బంది సునీల్, షబ్బీర్, ధర్‌సింగ్, సంజయ్, సుచరిత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News