Friday, August 15, 2025

నేడే ట్రంప్, పుతిన్ భేటీ

- Advertisement -
- Advertisement -

బెర్లిన్ : ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అలస్కాలో శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలు జరపనున్నసంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ ముగిసిన తరువాత ఉక్రెయిన్‌తో పుతిన్ యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఏడాది కెన్నడీ సెంటర్ గౌరవ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ప్రకటించిన తరువాత ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఆ తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఆయన వివరించలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు ఇతర ఐరోపా నేతలతో వర్చువల్ సమావేశం తరువాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.

పుతిన్‌తో సమావేశం సవ్యంగా సాగుతుందని భావిస్తున్నానని, ఒకవేళ విఫలమైతే రష్యాపై రెండో దఫా ఆంక్షలు కూడా విధిస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ తరఫునా భూభాగం విషయంలోనే చర్చలుంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మె క్రాన్ తెలిపారు. భవిష్యత్తులో త్రైపాక్షిక సమావే శం (ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీ) జరగాలని ట్రంప్ కోరుకుంటున్నారని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ తమ దేశంలో శాంతిస్థాపన అంశంపై ప్రపంచ నేతలు ఏకతాటిపై ఉన్నారన్నారు. పుతిన్ బుకాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అలాస్కా చర్చలు విఫలమైతే, రష్యా నుంచి చమురు ఇతర ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై మరిన్ని సుంకాలు, ఆంక్ష లు విధించగలమని అమెరికా ప్రకటించింది. ట్రం ప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై మరో విడత సుం కాలు విధించవచ్చునని, అయితే అది ట్రంప్ – పుతిన్ మధ్య జరిగే సమావేశం ఫలితాన్ని బట్టి ఉంటుందని అమెరికా ట్రెజరీ శాఖ మంత్రి హెచ్చ రించారు. బుధవారం ట్రెజరీ మంత్రి స్కాట్ బె సెంట్ ఓ టీవికి ఇచ్చిన ఇంటర్ వ్యూలో అలాస్కా లో శుక్రవారం నుంచి జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు రాని పక్షంలో అమెరికా మరో మారు పలుదేశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని ప్రకటించారు. రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నందువల్లే భారతదేశంపై యుఎస్ ద్వితీయ సుం కాలను విధించిందని, చర్చలు సజావుగా సాగని పక్షంలో ఆంక్షలు, ద్వితీయ సుంకాలు పెరిగే అవకాశం ఉందని బెసెంట్ బ్లూమ్ బెర్గ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News