Friday, August 15, 2025

నిందితుడికి ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

బాలికపై హత్యాచారం కేసులో నల్గొండ కోర్టు
సంచలన తీర్పు రూ.లక్ష10వేల జరిమానా
బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం
2013 ఏప్రిల్ ఘటనపై 12ఏళ్ల తరువాత న్యాయం

మన తెలంగాణ/నల్గొండ రూరల్ : బాలికపై అ త్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష వి ధిస్తూ తీర్పు నల్గొండ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం..నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2013 ఏప్రిల్ 28న 11 ఏళ్ల బాలికపై మన్యం చె ల్కలోని హైదర్ ఖాన్‌గూడలో మహమ్మద్ ముక్రం అత్యాచారం చేశాడు. అనంతరం చున్నీతో బాలిక కు ఉరి వేసి చంపి మురుగు కాలవలో పడేశాడు. ఈ కేసులో నిందితుడిపై మృతురాలి తండ్రి ఫిర్యా దు మేరకు నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పో క్సోచట్టం 2012లోని సెక్షన్ 6 కింద కేసు నమో దు చేశారు. పూర్తి దర్యాప్తు చేసి అనంతరం కోర్టు లో ఛార్జిషీట్ దాఖలు చేయగా, గురువారం అడిషనల్ జడ్జి కమ్ ఎస్‌సి, ఎస్‌టి కోర్టు అత్యాచారం పోక్సో కేసులో నిందితునికి దోషిగా నిర్ధారించి, తీర్పులో భాగంగా మర్డర్ కేసులో మరణశిక్ష (డబుల్ డెత్ పెనాల్టీ ) రూ.1,10,000 జరిమానా వి ధించింది. అంతేకాకుండా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ సం దర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ.. ఇలాంటి పో క్సో కేసులలో ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందని తెలిపారు.

ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజ య కుమార్ (డిఎస్‌పి), ప్రాసెక్యూషన్‌కు సహకరించిన నల్గొండ డిఎస్‌పి శివరాం రెడ్డి, 1 టౌన్ పిఎస్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ గుత్తా వెంకట్ రె డ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కందుగుల శ్రీవాణి, దా మోదరం శ్రీవాణి, వేముల రంజిత్ కుమార్ సిడిఓ వెంకటేశ్వర్లు, రాంబాబు లైజన్ అధికారులు, నరేందర్, మల్లికార్జున్ ను ఎస్‌పి తన పో లీసు కార్యాలయంలో అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా నిందితుని కి మరణ శిక్ష పడే విధంగా కృషి చేసి న పోలీసు అధికారులకు, పబ్లిక్ ప్రాసెక్యూటర్లకు మృతురాలి కు టుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, విశ్వా సం ఈ తీర్పుతో కలిగిందని హర్షం వ్యక్తం చేశా రు. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని అ న్నారు. ఎలాంటి కేసులో అయినా సాక్షులను భ యపెట్టడం గాని, తప్పుదోవ పట్టించడం గాని, రా జీ పడాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని హితవు పలికారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని ఎస్‌పి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News