Friday, August 15, 2025

సిందూర్ హీరోలకు శాల్యూట్

- Advertisement -
- Advertisement -

36మంది వాయుసేన అధికారులకు
పతకాలు తొమ్మండుగురికి వీర్ చక్ర
పురస్కారం ఒకరికి శౌర్య చక్ర,
26మందికి విశిష్ట సేవా అవార్డులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 36 మంది గగనతల యుద్ధ వీరులకు అత్యుత్తమ శౌర్యపతాకాలు ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో వీరికి శౌర్య పతాకాలను ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. ఈ మేరకు గురువారం రాత్రి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటన వెలువడింది. వీర్‌చక్ర పతకాలు పొందే తొమ్మండుగురులో యుద్ధ విమానాల పైలట్లు కూ డా ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ జరిగింది. ఈ సైనిక కార్యాచరణలో మన వాయుసేన కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్ మారుమూల ప్రాంతాలు ముర్దికే, బహావల్‌పూర్‌ల్లో ఉన్న ఉగ్రశిబిరాలను నేలమట్టంచేసి, అపారనష్టం కల్గించి మన యుద్ధ విమానాలు సు రక్షితంగా తిరిగి వచ్చిన

పందర్భంలో తమ శక్తియుక్తులను ప్రదర్శించిన యుద్ధ వీరులను ఇప్పు డు జాతి సత్కరిస్తోంది. వీర్ చక్ర మన దేశ శౌర్య పతకాలలో మూడో అత్యున్నత స్థాయి పతకంగా ఉంది. వాయుసేనకు చెందిన తొమ్మండుగురు ఈ శౌర్య పతకాలు పొందుతారు. వాయుసేనకు చెం దిన తొమ్మండుగురికి వీర్‌చక్ర, ఒక్కరికి శౌర్య చక్ర, 26 మంది వాయుసేన విశిష్ట పతకాలు ప్రకటించారు. వీర్ చక్ర అవార్డుల విజేతలు వీరే: గ్రూప్ క్యాప్టెన్ ఆర్‌ఎస్ సిదూ మనీష్ అరోరా, అనిమేష్ పత్ని, కుమార్ కర్లా, వింగ్ కమాండర్ జాయ్ చంద్ర, స్కాడ్రన్ లీడర్స్ సార్థక్ కుమార్, సిద్ధాంత్ సింగ్, రిజ్వాన్ మాలిక్, ఫ్లైయిట్ లెఫ్టినెంట్ ఎఎస్ ఠాకూర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News