Friday, August 15, 2025

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు చేరుకొని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు బయలు దేరారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. వరుసగా 12వ సారి ప్రధానిగా మోదీ ఎర్రకోట నుంచి జెండా ఎగురవేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పది సార్లు జాతీయ జెండా ఎగుర వేయగా మోడీ 12 సార్లు జెండా ఎగుర వేసి రికార్డు సృష్టించారు.  ఎర్రకోటకు ప్రముఖులు తరలివస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట చుట్టూ 11 వేల మంది పోలీసులతో భద్రతా కల్పించారు. 3 వేల మంది ట్రాఫిక్‌ పోలీసులు విధుల్లో ఉన్నారు. ఢిల్లీ వ్యాప్తంగా యావత్తు కెమెరా నిఘాను పటిష్ఠం చేశారు. ‘నయా భారత్‌’ ఇతివృత్తంతో ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

79th independence day celebrations

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News