- Advertisement -
జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల సమీపంలో జాతీయ రహదారి 44పై లారీని ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సిజిఆర్ ప్రైవేట్ బస్సు, మాచారం వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మహిళా ప్రయాణికులు చనిపోయారు. మృతులను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన అత్తాకోడళ్లు లక్ష్మీదేవి (60), రాధిక (50)గా గుర్తించారు. కడపలో బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
- Advertisement -