- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత బిఆర్ అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ పూల మాల వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు.
- Advertisement -