ప్రతిష్ఠాత్మక ‘సైమా’ (Saima) 2025 (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్) పురస్కారాల వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ) దర్శకుడు ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్ వెంకట్ (హనుమాన్)లని సైమా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవ రి కుంపటి వారిదే.
ఈ ఏడాది జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులొచ్చాయి. తెలుగు సినిమాకు ఇన్ని అవార్డులు వచ్చినా మన పరిశ్రమ (Our industry) స్పందించలేదు. జాతీయ అవార్డులను ఒక పండుగగా నిర్వహించుకోవాలి. ఇక్కడ అలా జరగడం లేదు. టాలీవుడ్‌లో ఎవరి కుంపటి వారిదే. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీ రో సందీప్ కిషన్, హీరోయిన్లు వేదిక, ఫారి యా అబ్దుల్లా, నటి మంచు లక్ష్మి, సైమా చైర్‌పర్సన్ బృందా తదితరులు పాల్గొన్నారు.