హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ’మిరాయ్’ (Mirai) లో సూపర్ యోధగా అలరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బాలీవుడ్ లీడింగ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ’మిరాయ్’ లోకి వచ్చారు. తన ప్రతిష్టాత్మక బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్, మిరాయ్ హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుంది. తేజ సజ్జ (Teja Sajja) సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. మిరాయ్లో మనోజ్ మంచు విలన్‌గా, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహి ంచడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిరాయ్ 2డి , 3డి ఫార్మాట్లలో ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ధర్మ ప్రొడక్షన్స్‌కు ‘మిరాయ్’ హిందీ రైట్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -