Friday, August 15, 2025

పెంచల్ రెడ్డి జీవిత కథతో..

- Advertisement -
- Advertisement -

భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన రచనా, దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఆపద్భాంధవుడు‘ (Aapadbhandhavudu) పెంచల్ రెడ్డి. డి. లీలావతి నిర్మించారు. ఈ చిత్రంలో పెంచల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో నటించారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ “వ్యాపారం, కుటుంబం, సమాజ సేవ.. ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ సేవా రత్నగా (gem service) గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి పెంచల్ రెడ్డి. ఆయన జీవితం ఆధారంగా  ‘ఆపద్భాంధవుడు‘చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రంలో ఆయన నటించడం విశేషం. నేనూ ఆయన మిత్రుడిగా నటించాను. ఇది సజీవ పాత్రలతో సాగే ఫిలిం. దీన్ని బయోపిక్‌లా, లైవ్ గా,  సరికొత్త పద్ధతిలో తెరకెక్కించాం”అని అన్నారు. ఈకార్యక్రమంలో పెంచల్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News