Friday, August 15, 2025

‘తెలివి తక్కువగా మాట్లాడాను’.. క్షమాపణలు చెప్పిన మృణాల్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి బిపాసా బసు గురించి ఆమె గతంలో చేసిన కొన్ని కామెంట్స్‌ మృణాల్‌ను చిక్కుల్లో పడేశాయి. అయితే ఆ కామెంట్స్ గురించి తాజాగా మృణాల్ వివరణ ఇచ్చారు. 19 ఏళ్ల వయస్సులో చాలా తెలివి తక్కువగా మాట్లాడానని మృణాల్ పేర్కొన్నారు. ‘‘అందంపై సరదాగా చేసిన వ్యాఖ్యలు అవి. కాని, ఆ మాటలతో ఇంత మంది బాధపడతారని నాకు తెలియదు. ఎవరినీ బాధపట్టాలనేది నా ఉధ్దేశ్యం కాదు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఇంటర్వ్యూ అది. ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. ఏళ్లు గడిచే కొద్ది నాకు అందం గురించి తెలుస్తోంది. అది ఎంతో విలువైనది. మనస్సుతో చూస్తే ప్రతీది అందంగా కనిపిస్తుంది’’ అంటూ మృణాలో ఇ‌న్‌స్టాగ్రామ్‌లో మృణాల్ పేర్కొన్నారు.

మృణాల్ (Mrunal Thakur) ఓ ఇంటర్వ్యూలో బిపాసా బసు గురించి మాట్లాడారు. బిపాసా కంటే తానే అందంగా ఉంటానని.. బిపాసా కండలు తిరిగి మొగాడిలా ఉంటుందని అన్నారు. ఆమెతో పోలిస్తే.. తాను ఎన్నో రేట్లు అందంగా ఉంటానని అన్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. మృణాల్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. బిపాసా కూడా పరోక్షంగా దీనిపై స్పందించారు. మహిళలు ఎంతో దృఢంగా ఉండాలని.. అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News