- Advertisement -
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై ఆర్టీసి బస్సును, లారీ ఢీకొంది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు బస్సు వెళ్తుండగా కంటైనర్ ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలయ్యిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల సుమారు 2 కి.మి. మేర వాహనాలు నిలిచి పోయాయి.
- Advertisement -