Friday, August 15, 2025

Venky77: క్రేజీ కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలు అంటే గుర్తుకు వచ్చేది విక్టరీ వెంకటేష్ (Venkatesh )పేరే. ఆయన సినిమా వచ్చిందంటే.. చాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు పండగే. ఈ ఏడాది ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్నారు వెంకీ. ఇప్పుడు ఆయన మరో సినిమాను ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వెంకటేష్ చేస్తున్న సినిమా ప్రారంభమైంది. నేడు షూటింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొట్టారు. వెంకటేష్ కెరీర్‌లో ఇది 77వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతంలో వెంకటేష్ (Venkatesh) నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పని చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా రావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. త్వరలోనే వెంకీ77 చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్రివిక్రమ్ గత చిత్రాల్లోలానే ఈ సినిమాలో కూడా ఇద్దరు కథానాయికలు ఉండనున్నారట. అందు కోసం త్రిష, నిధి అగర్వాల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరితో పాటు హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ పేరు కూడా వినిపిస్తోంది. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్ పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News