Friday, August 15, 2025

భార్యపై అనుమానంతో కన్నబిడ్డను పొట్టనబెట్టుకున్నాడు..

- Advertisement -
- Advertisement -

చిటౌవ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిటౌవ (Uttarpradesh Chitaua) గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను అనుమానించే ఓ కసాయి భర్త.. రెండు సంవత్సరాల చిన్నారిని తన కోపానికి బలి చేశాడు. రెండేళ్ల కుమారుడికి పురుగుల మందు తాగించి మేడపై నుంచి తోసేశాడు. నిందితుడి సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. చిటౌవ గ్రామానికి చెందిన రాజ్ బహదూర్‌కు యమునావతి అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి అంకుశ్, లలిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

భార్యకి వివాహేతర సంబంధం ఉందని రాజ్ తరచూ ఆమెను అనుమానిస్తూ ఉండేవాడు. ఈ విషయంలో వారికి తరచూ గొడవలు జరిగేవి. కాగా, గురువారం మద్యం కోసం డబ్బులు ఇవ్వమని భార్యను అడగ్గా ఆమె అందుకు నిరాకరించింది. దీంతో మళ్లీ గొడవ జరిగి.. భార్య బయటకు వెళ్లిపోయింది. కోపంతో రాజ్ గేటుకు తాళం వేసి లలిత్(2)ను తీసుకొని మేడ మీదకు వెళ్లాడు. అక్కడ ఉన్న పురుగుల మందును ఆ చిన్నారికి బలవంతంగా తాగించాడు. అంతటితో ఆగకుండా మేడపై నుంచి కిందకు తోసేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే లలిత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. (Uttarpradesh Chitaua)

విషయం తెలుసుకొన్న ఎస్పి అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే.. రాజ్ కత్తితో పొడుచుకుంటానంటూ బెదిరించాడు. స్థానికుల సహాయంతో అతడిని పోలీసలు అరెస్ట్ చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News