Friday, August 15, 2025

భారత్‌కు ప్రపంచ దేశాల శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుక కోసం ఎర్రకోట పరిసరాల్లో 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ‘నయా భారత్ ఇతివృత్తంతోఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, సింగపూర్, మాల్దీవుల నుంచి సందేశాలు అందాయి. భారత్‌తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలు, మంత్రులు పేర్కొన్నారు.
అమెరికా
“తమ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా నిర్వహించుకుంటున్న భారత ప్రజలకు అమెరికా ప్రజల తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్, ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్యమైన యూఎస్‌ల మధ్య చారిత్రాత్మక సంబంధం కొనసాగుతోందని పేర్కొన్నారు. భారత్, అమెరికా సంబంధాలు ఎంతో దృఢమైనవని, ఇరు దేశాలు మరింత శక్తివంతమైన ఒప్పందాలను చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.
రష్యా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీ సామాజిక ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక ఇతర రంగాల్లో విజయాన్ని సాధిస్తూ.. వేగవంతంగా ముందుకు సాగుతోందని, ప్రపంచ వేదికపై తగిన గౌరవం పొందుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎజెండాలోని కీలక సమస్యలను పరిష్కరించడంతో చురుకుగా వ్యవహరిస్తోందన్నారు. భారత్‌తో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నాం. మా ఉమ్మడి ప్రయత్నాల ద్వారా బహుళ రంగాల్లో నిర్మాణాత్మక, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఇజ్రాయెల్
భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు ఇజ్రాయెల్ ఎంబసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
మాల్దీవులు
“మాల్దీవులకు న్యూఢిల్లీ ఎల్లప్పుడూ విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా ఉంటుందని, ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సంబంధాలు మరింత ముందుకు వెళ్లాలని కాంక్షిస్తున్నట్టు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రకటించారు.
సింగపూర్
భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ ప్రకటించారు. ఈ వారం ప్రారంభంలో న్యూఢిల్లీతో జరిపిన చర్చలు ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశాయని , మరిన్ని దౌత్యసంబంధాల కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News