Saturday, August 16, 2025

ఏ ఏటి కా ఏడు మోడీ సరికొత్త స్టయిల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రత్యేకమైన వస్త్రధారణతో వచ్చారు. చారిత్రక ఎర్రకోట నుంచి జాతిని ఉద్ధేశించి ప్రసంగించేందుకు వచ్చిన ఆయన ఆహార్యం లేదా పోషక్ అందరిని ఆకట్టుకుంది. పొడవాటి కాషాయ రంగు తలపాగా చుట్టారు. తెల్లటి కుర్తా, చుడీదార్ పైజామా, పైన కాషాయ రంగు కోటు , త్రివర్ణ కండువాతో అలరించారు. సాధారణంగా పంద్రాగస్టుకుప్రధాని మోడీ చుట్టే తలపాగాలు వరుసగా తమవైన రీతిలో నేత్రానంద తీరుతో ఉంటున్నాయి. ఏ ఏటికా ఏడు ఆయన ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు.

దేశంలోని ఏదో ఒక ప్రాంతంలోని చేనేత హస్తకళల రూపాల వస్త్రాలను ధరిస్తున్నారు. గత ఏడాది ఆయన ముదురు రంగు రాజస్థానీ సాంప్రదాయక లెహరియా తలపాగాతో వచ్చారు. ఇది పలు రంగులు నారింజ, పసు, ఆకుపచ్చలను సంతరించుకుని ఉంది, భారతీయ సాంస్కృతిక సంపన్నతను చాటింది. అంతకు ముందటి ఏడాది ఆయన పలు ఛాయలు సంతరించుకుని ఉన్న బంధని ప్రింట్ తలపాగాతో ప్రత్యేకతను చాటారు. నల్లటి పొట్టి కోట్ వేసుకున్నారు. తొలిసారిగా ప్రధాని అయ్యి 2014లో ఎర్రకోట నుంచి ప్రసంగానికి వచ్చినప్పుడు ముదురు జోధ్‌పూరి బంధేజ్ తలపాగా చుట్టారు. 2015లో ఏకంగా పంచరంగుల టర్బన్‌తో వచ్చారు.

2020లో కరనా మహమ్మారి దశలో తెల్లటి మాస్క్ , కాషాయ రంగు అంచులతో ఉన్నది ధరించి ప్రజలకు కరోనా నివారణ సందేశం వెలువరించారు. ప్రతి ఏటా ఆయన వరుసగా తన తలపాగాల ప్రత్యేకతలను నిలబెట్టుకుంటున్నారు. తలపాగా ఔన్నత్య ప్రతీక. ఆత్మవిశ్వాస ప్రతీక. గ్రామీణ వాతావరణంలో తరతరాల నుంచి ఇమిడి ఉండే ఈ పెద్దరిక ప్రదర్శన ఆచారాన్ని మోడీ సొంతం చేసుకుంటూ వస్తున్న తంతు ఇప్పుడు వరుసగా 12 పర్యాయం అయింది. ఆయన సందేశాలతో పాటు ఆయన వస్త్రధారణ కూడా పలు బాష్యాలకు దారితీసే ప్రకటనగా మారుతోంది. ఎర్రకోటకు వచ్చే ముందు ప్రధాని మోడీ తమ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్న భారత్ అవతరణకు మరింతగా కష్టపడి పనిచేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశలు ఆకాంక్షలను నిజం చేసేందుకు, వారి త్యాగాలను, పట్టుదలను స్ఫూర్తిగా తీసుకుని వెళ్లాల్సి ఉందని తెలిపారు. ఎందరో మహానుభావులు మన దేశానికి స్వాతంత్రం అందించి సెలవు తీసుకున్నారు. మనం దేశానికి మరింత ఆర్థిక స్వాతంత్య్రం సిద్ధించే దిశలో కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News