మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర డిజిపి జితేందర్‌కు మాతృవియోగం కలిగింది. డిజిపి జితేందర్ తల్లి కృష్ణ గోయల్(85) శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమెను హైదరాబాద్‌లోని అపోలో హస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలిసింది. జితేందర్ తల్లి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సంతాపం తెలిపారు.
డిజిపి జితేందర్‌కు తీరని లోటు: కెటిఆర్
డిజిపి జితేందర్ తల్లి కృష్ణ గోయల్ మృతి ఆయనకు తీరని లోటని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఆమె మృతి పట్ల కెటిఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో డిజిపి మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు దైర్యం ఇవ్వాలని కెటిఆర్ కోరారు.