మేషం: మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వీరికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని రోజులపాటు నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేయాలి అనే మీ కోరిక ఈ వారం నెరవేరుతుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని మెలకువలు అవసరం అవుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే కష్టపడతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవలసిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గతంలో కంటే కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీరు సొంతంగా చేసే వ్యాపారాలలో లాభాలు అధికంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి హోటల్ రంగంలో ఉన్నవారికి నిత్యవసర సరుకులు అమ్మే వారికి చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. మీరు ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రీన్.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది కొంతమంది విషయంలో ఒక సంబంధం చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆదరణ బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మీకు ఎదురైన సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వీసా లభిస్తుంది. సాధ్యమైనంతవరకు మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్లడం మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు వహించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. మెడలో కరుంగలి మాలను ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య వరంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కుటుంబ వాతావరణం మీకు అశాంతిని కలిగించే విధంగా ఉంటుంది. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి.. సంతాన పరంగా అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం తగదు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా ఉత్సాకరమైన వాతావరణముంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి అందిన సమాచారం కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నప్పటికీ చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు కూడా లక్ష్మి తామర వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేస్తారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. కీలకమైన విషయాలలో సంత నిర్ణయాలు పనికిరావు. గణపతి స్వామి వారికి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. జిల్లేడు గణపతిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు బ్లూ.
తుల: తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపార పరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి వస్తాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు తీర్చి వేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ధనం అధికంగా ఖర్చవుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు నీలి రంగు.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. లీజులు లైసెన్సులు లభిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. దీర్ఘకాలిక వ్యవహారాలు వివాదాలు పరిష్కారం అవుతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణ ఉత్సాహంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్య పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ పరంగా కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పటికీ కొంత ఒత్తిడికి గురవుతారు. ఎంతోకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్ లభిస్తుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు.
మకరం: మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులందరికీ ధన సహాయం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొంతమందికి ఉద్యోగాలలో స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రే.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలిన నాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. కుటుంబ పరంగా సంతానం యొక్క విద్యాపరంగా అనుకోని ఖర్చులు పెరుగుతాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. మీపై కొన్ని నిందలు ప్రచారంలో ఉంటాయి. ఉద్యోగం మారకపోవడం మంచిది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించండి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు తప్పక పోవచ్చు. ఆహార నియమాలు పాటించండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఫార్మా రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ రంగంలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
మీనం: మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శని బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాలపరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీరు కోరుకున్న పదవి కానీ ఉద్యోగం కానీ లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు కలిసి రావు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ససమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యమైన విషయాలలో నలుగురి సలహాలు తీసుకొని మీకు నచ్చినవి పాటిస్తారు. పొదుపు ప్రయత్నాలు కలుస్తాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
Rasi phalalu telugu weekly
Rasi phalalu telugu weekly
Rasi phalalu telugu weekly
Rasi phalalu telugu weekly