- Advertisement -
హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని మునుగోడు నియోజక వర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించామని, రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని (Rajagopal Reddy case) క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని తెలియజేశారు. బిసి రిజర్వేషన్ల విషయంలో త్వరలో స్పష్టత వస్తుందని, మార్వాడీలు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
- Advertisement -