Sunday, August 17, 2025

#OG నుంచి ప్రియాంక మోహన్‌ ఫస్ట్ లుక్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజి. ఈ మూవీ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో యంగ్ డైరెక్టర్ సుజీత్‌ తెరకెక్కిస్తున్నాడు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. శనివారం సాయంత్రం ఈ మూవీ నుంచి ప్రియాంక ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. మూవీలో కణ్మని క్యారెక్టర్ లో ప్రియాంక నటిస్తున్నట్లు వెల్లడించారు. పోస్టర్ లో చీర కట్టుతో ప్రియాంక అందంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజి మూవీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News