- Advertisement -
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు వరద ప్రవాహానికి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ఉదృతంగా కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిన నేపథ్యంలో అధికారులు.. ప్రాజెక్టు 17 గేట్లు తెరచి కిందకు నీటిని వదిలారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రాజెక్టు వరద ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాడు. దీంతో యువకుడిని కాపాడేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. యువకుడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వరదలో కొట్టుకుపోయిన యువకుడిని కడెం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి గంగాధర్‌గా గుర్తింంచారు.
- Advertisement -