- Advertisement -
విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్ లో శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..బాచుపల్లిలోని ఓ ఆపార్ట్ మెంట్ లో వ్యాచ్ మెన్ గా పని చేస్తున్న వ్యక్తి దుర్గా ప్రసాద్(35) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు.సెల్లార్ లో నీళ్లు నిండాయని మోటారు పెట్టి నీటిని తీస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంకి చెందినవాడుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
- Advertisement -