Sunday, August 17, 2025

‘డైలీ’ ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు.. వడ్డీకి వడ్డీ కట్టాల్సీందే!

- Advertisement -
- Advertisement -

ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఓకే రోజు ఏకంగా పదిమందికిపైగానే!
నిరుపేదలే వారి టార్గేట్
ఆదివారం సైతం వదిలి పెట్టని ఘనులు
సామాన్యుల కష్టార్జితాన్ని వడ్డీ రూపంలో ఎత్తుకుపోతున్నారు.
కడితే సరి లేదంటే వడ్డీకి వడ్డీ కట్టాల్సీందే
ప్రశ్నిస్తే అధికారులు అండగా ఉన్నారంటూ బెదిరింపులు
ప్రతిరోజు పది మందికి పైగానే?
పట్టించుకోని సంబంధిత అధికారులు
మన తెలంగాణ/చర్ల: మండలంలో నిరుపేదలే లక్షంగా డైలీ ఫైనాన్స్ నిర్వహుకులు రెచ్చిపోతున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండానే వడ్డి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు చర్ల మండల కేంద్రంగా తీష్టవేసి నిరుపేదలను టార్గెట్ చేస్తూ వారి కష్టార్జితాన్ని వడ్డీ రూపంలో ఎత్తుకుపోతున్నారు.అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని లక్షలు గడిస్తున్నారు.ఇచ్చే ముందు వినయంగా మాటలు చెప్పే ఫైనాన్స్ నిర్వహుకులు తరువాత అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.ఒక్కవారం కట్టకపోయిన దానికి అధనంగా కలిపి కట్టాల్సీందే నంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కొందరు బాధితులు తెలుపుతున్నారు.

కడితే సరి లేదంటే వడ్డికి వడ్డీ కలిపి కట్టాల్సీందేనంటూ హుకుం జారీ చేస్తున్నారని ఎదురు ప్రశ్నిస్తే మీ బతుకులు బజారులో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దిక్కుతోచని పరిస్థితుల్లో అప్పులు తెచ్చి మళ్లీ అప్పులు కడుతున్నామంటూ తెలుపుతున్నారు.ఇంత జరుగుతున్న అధికారులు కనీసం ఆరా తీసిన దఖలాలు లేవని చెప్పాలి..ఇదిలా ఉంటే ఆంధ్ర నుండి వందలాది మంది వ్యక్తులు ఇక్కడ డైలీ ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.వీరంత ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చి ఇక్కడ తీష్ట వేసినట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే కట్టడి చెయ్యాల్సీన రెవిన్యూ,పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదనే అరోపణలు వ్యక్తమవుతున్నాయి.సోమవారం నుండి ఆదివారం వరకు రోజుకు 10 నుండి 15మందికి పైగా గ్రామాల్లో సంచరిస్తున్నారు.ఫైనాన్స్ వ్యాపారులు వస్తున్నారంటే చాలు సామాన్య ప్రజలు హాడలిపోతున్నారనే చెప్పాలి!అసలే పరువు మర్యదలంటూ బతుకు బండి సాగించే పేదలు ఎక్కడ తమ పరువుపోతుందనే భయంతో బ్రతకాల్సీన పరిస్థితులు దాపురించాయంటూ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.

చర్లలో డైలీ ఫైనాన్స్ వ్యాపారాలు జరుగుతున్న తీరు
సోమవారం మొదలు ఆదివారం వరకు జోరుగా సాగే డైలీ ఫైనాన్స్ దందాలో మొత్తం దాదాపు ఒక్కో రోజు పది నుండి 15మందికి పైగా ఫైనాన్స్ వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతున్నారు.ఒక్కొక్కరిది ఒక్కో వడ్డీ రేట్ ఒకరు 5 నుండి 8 రూపాయాల వరకు వడ్డీ వసూల్ చేస్తే మరికొందరు 8 నుండి 12 రూపాయాల వరకు వడ్డీ వసూల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఉదహరణకు ఆదివారం ఫైనాన్స్ నిర్వహుకులు 10వేల రూపాయాలు ఇచ్చి 12,500 వేల రూపాయాలు వసూల్ చేస్తున్నారు.అయితే ముందుగా 10వేల రూపాయాలు ఇచ్చేముందు ఒక్క వెయ్యికి 50 నుండి 70 వరకు మినహాయించుకోని ఇస్తారు.అంటే పదివేలు తీసుకుంటే మనకు ఇచ్చేది 9,300 నుండి 9,500వరకు మాత్రమే ఇలా ఒక్కో ఫైనాన్స్ నిర్వహకులు ఒక్కో వడ్డీరేట్లు వసూల్ చేస్తున్నారు.సోమవారం,మంగళవారం,బుధవారం,గురువారం,శుక్రవారం,శనివారం,ఆదివారం వరకు ఇలాంటి వడ్డీనే వసూల్ చేస్తున్నారు.ఇలాంటి అధిక వడ్డీలను కట్టడి చెయ్యాలని మండల వాసులు కోరుతున్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News