- Advertisement -
తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ అతడికి పునర్జన్మను ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాసులు అనే భక్తుడు శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకొని ప్రసాదం కోసం లడ్డూ కౌంటర్ వద్దకు వెళ్లిన శ్రీనివాసులు అనుకోకుండా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న గురప్ప అనే కానిస్టేబుల్ సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం మెరుగైన వైద్యం కోరకు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం శ్రీనివాసులుకు వైద్యం అందుతోంది. భక్తుడి ప్రాణాలు కాపాడిన గురప్పను మిగితా భక్తులు, పోలీసులు అభినందించారు.
- Advertisement -