Sunday, August 17, 2025

చేతి సంచుల్లో బియ్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఇకపై సంచుల్లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత మూడు నెలల రేషన్ బియ్యం ఒకే సారి ఆగస్టు కోటా వరకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై సెప్టెంబర్ నుంచి రేషన్ బియ్యం పంపిణీని ప్రత్యేకంగా రూపొందించిన సంచుల ద్వారా లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ని ర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక బ్యా గును రూపొందించారు. తెల్లటి రంగులో ఉన్న సంచి మీద అగ్రభాగాన ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖచిత్రాలు ఉన్నాయి. మధ్యలో ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలను ముద్రించారు.

బియ్యం సంచిపైన “అందరికీ సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సా ధ్యం” అనే నినాదం ఉంటుంది. సుమారు యాబై రూపాయల విలువజేసే ఈ సంచిలో పేదలకు ఉచితంగా ఇచ్చే సన్న బియ్యంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా ఉండనున్నాయి. సెప్టెంబర్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ తీసుకునే వారందరికి సన్న బియ్యం తో పాటు ప్రత్యేకమైన ఈ సంచిని కూడా ఉచితం గా ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ డిపోలకు ప్రత్యేకంగా రూపొందించిన చేతి సంచులు చే రాయి. పర్యావరణ హితంగా ఈ సంచులను రూ పొందించినట్లు అధికారులు తెలిపారు. తద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే పర్యావరణహిత బ్యాగులను అందజేయబోతోంది. వచ్చే నెలలో అందజేసే సంచులను ప్రతినెలా బి య్యం కోసం వెళ్లేటప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది

.
బ్యాగుల లక్ష్యం అదే
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందజేయనున్న పర్యావరణహిత సంచులు ప్రస్తుతం బ్యాగులు స్టాక్ పాయింట్లో సిద్ధంగా ఉన్నాయి. వచ్చే నెల కో టాకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించిందని, దానికి అనుగుణంగా బియ్యంతో పా టు బ్యాగులను రేషన్ దుకాణాల్లోనే అందచేస్తారు. ప్లాస్టిక్ బ్యాగులను త్యజించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. వర్షాకాలం దృష్యా బియ్యం నిల్వ, రవాణాలో పలు ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ప్రభుత్వం జూన్, జులై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పం పిణీ చేసింది. ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నారు. మూడు నెలలకు కలిపి జూన్‌లో 18 కిలోలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య మేరకు నెలకు సుమారు 1.9 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ పరిమాణం కొత్త లబ్ధిదారులను బట్టి పెరగనుంది.

95 లక్షలు దాటిన రేషన్ కార్డులు
కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డుల్లో కుటుంబంలోని అదనపు సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ సైతం కొనసాగుతోంది. ఈ రేషన్ బియ్యం సరఫరాలో ముందుగా మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్లకు గోధుమలు, చక్కెర అందుతున్నాయి. కందిపప్పు, ఉప్పు, చింతపండు, నూనె తదితర నిత్యవసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ కార్డుల సంఖ్య ప్రస్తుతం 95 లక్షలు దాటినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News