- Advertisement -
మన తెలంగాణ/బచ్చన్నపేట: బచ్చన్నపేట మండలం గంగాపూర్ గ్రామంలో కాలభైరవస్వామి ఉత్సవాలు శనివారం అంగ రంగ వైభవంగా జరిగాయి. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు సాయిచరణ్ నేతృత్వంలో తెల్లవారుజామున నుంచి స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పూజలకు హాజరైన భక్తులకు ఎడ్ల జ్యోత్స, మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, సాయికుమార్, కర్ణాకర్, నర్సయ్య, రమేశ్, సనీత్‌రెడ్డి, సోమిరెడ్డి, విజట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -