Sunday, August 17, 2025

పూణేలో మగ్గం చీరలు అమ్మి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గట్టు: మండల పరిధిలోని మాచర్ల గ్రామానికి చెందిన పిజి రఘు 38సం.రాలు, మరోకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రెండు రోజుల క్రితం కారులో మహారాష్ట్ర పూణేలో మగ్గం చీరలు అమ్మి తిరుగు ప్రయాణంలో కర్ణాటక రాయచూరు జిల్లా సైదాపురం దగ్గర అగివున్న లారీని కారు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో పిజి రఘుతో పాటు మరో వ్యక్తి ఘటన స్థలంలో మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రఘు అనే వ్యక్తి 3 వందల ముగ్గంపై చేనేత చీరల తయారి అనంతరం వాటిని మహారాష్ట్రలో అమ్మేందుకు వెళ్ళేవాడని వ్యాపారం నిమిత్తం వెళ్ళి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News