Sunday, August 17, 2025

కళాకారుడు కొండయ్యకు ఉత్తమ సేవా అవార్డు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మధిర: ప్రముఖ జానపద మిమిక్రీ కళాకారుడు (మధిర ఆశ మిత్ర) సంఘ సేవకులు లంకా కొండయ్యకు శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఖమ్మం మున్సిపాల్ కమిషనర్ అభిషేక్ ఆగస్య సమక్షంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదికారిణి డాక్టర్ బానోత్ కళావతిభాయ్ ద్వారా కలెక్టర్ చేతులు మీదుగా ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్నారు. అదే విధంగా కొండయ్య తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ద్వారా జిల్లా నుండి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వఆరోగ్య పధకాలు దీర్ఘ కాలిక మొండి జబ్బులపై తనదైన శైలిలో వివిధ జానపద పౌరాణిక కళల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవగాహన ప్రచారం చేస్తున్నందుకు గాను, టీబీ ఎయిడ్స్, కుష్ఠు పోలియో కరోనా, డెంగీ, మలేరియా జబ్బులు గురించి ప్రచారం చేయటం వృత్తి -ప్రవృత్తి కీ న్యాయం చేయటం బెస్ట్ సర్వీసెస్ క్రింద అవార్డుకు ఎంపిక చేసి ఇచ్చినట్లు కొండయ్య వివరించారు.

ఈ సందర్బంగా కొండయ్య మాట్లాడుతూ.. నా సేవలు గుర్తించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వివిధ ప్రోగ్రాం అధికారులు,పీహెచ్ సీ దెందుకూరు వైద్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొండయ్య తెలిపారు. ఈ అవార్డు రావటం పట్ల మధిర ప్రాంత ప్రముఖులు రాజకీయ నాయుకులు, ఆర్య వైశ్య మిత్రులు రైతు సోదర్లు ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు బంధు మిత్రు లుప్రింట్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులు, ఆరోగ్య సిబ్బంది, కళాకారులూ బృందం తదితరులు కొండ య్యకు అభినందనలు తెలిపినారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News