Sunday, August 17, 2025

విద్యుత్ పనులు చేసే క్రమంలో పగిలిన గ్యాస్ పైప్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ పట్టణం నుండి కిష్టాపూర్ గ్రామం వెళ్లే దారిలో విద్యుత్ అధికారులు స్తంభం తొలగిస్తుండగా గ్యాస్ పైప్ లైన్ పగిలింది. దీంతో భూమిలో నుంచి గ్యాస్ పైకి ఎగిసిపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యాలయానికి సమాచారం అందించడంతో ఆ సంస్థ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి మరమ్మతులు చేశారు. గ్యాస్ గాల్లోకి ఎగచిమ్మడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే వెంటనే మనమతులు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో గల భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ నుండి మేడ్చల్ పట్టణానికి గ్యాస్ సరఫరా అవుతోంది. ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News