Sunday, August 17, 2025

ఆ ఇద్దరు అద్భుత క్రికెటర్లు: స్టీవ్ స్మిత్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (భారత్), జాక్వెస్ కలిస్ (సౌతాఫ్రికా)లు అత్యుత్తమ క్రికెటర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. ఇద్దరు ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేశారన్నారు. ముఖ్యంగా టెస్టుల్లో సచిన్, కలిస్‌కు ఎవరూ సాటిరారని తెలిపాడు. కలిస్‌తో పోల్చితే సచిన్ కాస్త మెరుగైన ఆటగాడని చెప్పక తప్పదన్నాడు. అయితే కలిస్ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. వీరిద్దరూ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు కొనసాగారన్నాడు. వీరిని ఆదర్శంగా తీసుకుని తనలాంటి ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారనే విషయాన్ని స్మిత్ గుర్తు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News