Sunday, August 17, 2025

‘ఓజి’లో ‘కన్మణి’గా ప్రియాంక అరుల్ మోహన్

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ’ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’ఓజీ’ సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణి పాత్రలో అలరించనున్నారు.

’ఓజీ’ రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక పోస్టర్ దయ, బలం, నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తోంది. మరో పోస్టర్ ప్రశాంతత, గృహ వాతావరణాన్ని సూచిస్తుంది. ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ కట్టిపడేస్తోంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News