Sunday, August 17, 2025

మూడో టీ20లో సౌతాఫ్రికా ఓటమి.. ఆస్ట్రేలియాకు టి20 సిరీస్

- Advertisement -
- Advertisement -

కేన్స్: దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన మూడో, చివరి టి20లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి టి20లో ఆసీస్, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఫలితాన్ని తేల్చే మూడో టి20లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 172 పరుగులు చేసింది.

ఓపెనర్లు మార్‌క్రమ్ (1), రికెల్టన్ (13) విఫలమయ్యారు. అయితే ప్రెటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన ప్రెటోరియస్ 15 బంతుల్లోనే ఐదు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. మరోవైపు బ్రెవిస్ తన దూకుడును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బ్రెవిస్ 26 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, ఓ ఫోర్‌తో 53 పరుగులు సాధించాడు. ట్రిస్టన్ స్టబక్స్ (25), వండర్ డుసెన్ 38 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో సౌతాఫ్రికా స్కోరు 172 పరుగులకు చేరింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ మిఛెల్ మార్ష్ 37 బంతుల్లో ఐదు సిక్సర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. హెడ్ (19) తనవంతు పాత్ర పోషించాడు. అయితే జోష్ ఇంగ్లిస్ (0), కామెరూన్ గ్రీన్ (9) విఫలమయ్యారు. కానీ గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మాక్స్‌వెల్ 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా ఉత్కంఠ విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News