- Advertisement -
ప్రయాణీకుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే తిరుపతి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 17న ఆదివారం తిరుపతిసి సికింద్రాబాద్ 07097), ఈ నెల 18న సోమవారం సికింద్రాబాద్ తిరుపతి (07098) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్లే సిపిఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, రాజంపేట్, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంటకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయిచూర్, కృష్ణా, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లకు ఫస్ట్ ఎసి కమ్ సెకండ్ ఎసి, 2ఎసి, 3 ఎసి ఎకానమి, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
- Advertisement -