Sunday, August 17, 2025

భారత స్పీడ్ స్కేటింగ్ టీమ్ కోచ్‌గా ఖదీర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే బారత జట్టు ప్రధాన కోచ్‌గా తెలంగాణకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్ ఎంపికయ్యారు. ఆయన శాట్స్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. డెహ్రాడూన్ వేదికగా ఆగస్టు 20 నుంచి ఆసియా స్పీడ్ స్కేటింగ్ పోటీలు జరుగనున్నాయి. ఇందులో భారత్‌తో పాటు ఆసియాలోని వివిధ దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఖదీర్‌ను కోచ్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఖదీర్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు సర్వం ఒడ్డుతానని తెలిపారు. జట్టును విజేతగా నిలిపేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News