Sunday, August 17, 2025

ఎల్లంపల్లి మోటార్లు మేము ఆన్ చేయాలా? మీరు చేస్తారా?: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వస్తుందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గెట్లు ఎత్తి నీటిని వృథా చేస్తున్నారని, 60 వేల క్యూసెక్కుల వరదను సముద్రంలోకి వదులుతున్నారని దుయ్యబట్టారు. ఆదివారం సిద్ధిపేటలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మీద కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. బురద రాజకీయం చేస్తూ వరదను వృథాగా పోనీయొద్దని, గోదావరి పరివాహకంలో చాలా జలాశయాలు ఖాళీగా ఉన్నాయని, ఎల్లంపల్లి నుంచి వెంటనే రోజుకు రెండు టిఎంసిల నీళ్లు ఎత్తిపోయాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఏడు మోటర్లు ఉంటే రెండు మాత్రమే నడుపుతున్నారని, కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేసేందుకు మోటార్లు నడపడంలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుంటే తాము వెళ్లి ఆన్ చేస్తామని హెచ్చరించారు. దురుద్దేశంతో మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయడంలేదని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News